వైయస్ నిర్లక్ష్యం: టిడిపి నేతల ధర్నా

ముఖ్యమంత్రే వచ్చి కలుస్తారని, నిరీక్షించాలని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది తెలుగుదేశం నాయకులకు సూచించారు. ఎంతకీ ముఖ్యమంత్రి తమను కలవడానికి రాకపోవడంతో వారు ధర్నాకు దిగారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అపకపోతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాపాడాలని ముఖ్యమంత్రి చెప్పడానికి తెలుగుదేశం నాయకులు వచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపులోనికి వెళ్లకుండా బయటే నిలబెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
టిడిపి నేతలు ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డం పడ్డారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన వారిలో కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. తమకు అపాయింట్ మెంట్ ఇచ్చినా తమను పట్టించుకోలేదని టిడిపి నేతలు విమర్శించారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications