జగ్గయ్యపేటలో ఖైదీ మృతి: ఆందోళన
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్య పేట సబ్ జైలు అండర్ ట్రయల్ ఖైదీ శ్రీను మృతి తీవ్ర సంచలనం సృష్టించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీను మరణించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణపై శ్రీనుతో పాటు 9 మంది ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల చర్య వల్లనే శ్రీను మరణించాడని అతని బంధువులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సబ్ జైలు వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దాదాపు 300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొంటున్నారు. తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ వారు వివిధ పద్ధతుల్లో వేధిస్తున్నారని, శ్రీనుపై కూడా వేధింపుల్లో భాగంగానే కేసు పెట్టారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications