సీఎం అవుతారు, పర్ఫెక్ట్ పొలిటీషియన్.. జూనియర్ ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ లపై వేణుస్వామి

సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల జాతకాలకు సంబంధించి సంచలన జ్యోతిష్య అంచనాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు పైన కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పర్ఫెక్ట్ పొలిటీషియన్ గా ఆయన అభివర్ణించారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి సంచలన జోస్యం చెప్పారు.

Astrologer Venu Swamy calls Pawan Kalyan a perfect politician and predicts Jr NTR as the future Chief Minister

పవన్ కళ్యాణ్ పై వేణుస్వామి అప్పుడలా ఇప్పుడిలా

గతంలో పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి ఆయన ముక్కు సూటి స్వభావం ఉన్నవాడని, ఆయన స్వభావం రాజకీయాలకు సరిపోదు అని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడని ప్రశంసించారు వేణుస్వామి. ఇక ఇదే సమయంలో 2024 ఎన్నికలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆయన చెప్పిన జాతకఅంచనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తుపై వేణు స్వామి

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ మఖా నక్షత్రంలో జన్మించాడని, ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్టార్ బాగుంటుందని, రాజకీయంలో రాణిస్తారని తెలిపారు. జయలలిత కూడా అదే నక్షత్రంలో జన్మించినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ యోగ పురుషుడు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని వేణుస్వామి జోస్యం చెప్పారు.

విశాఖలో కాగ్నిజెంట్ సెజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు పండుగే!
విశాఖలో కాగ్నిజెంట్ సెజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు పండుగే!

చంద్రబాబు నాయుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్

నరేంద్ర మోడీ కారణజన్ముడని, చంద్రబాబు నాయుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి శత్రువులు కూడా క్షమించే గుణం ఉన్న గొప్ప వ్యక్తి అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు తోడుగా, కెసిఆర్ తెలంగాణ జాతిపితగా వేణు స్వామి అభివర్ణించారు. ఇదే సమయంలో రాబోయేకాలంలో భారతదేశంలో అనూహ్య సంఘటనలు జరుగుతాయని వేణు స్వామి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+