వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
15న చిరు పార్టీలో శివశంకర్
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్ ఈ నెల 15వ తేదీన అధికారికంగా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. ఆయన ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని మార్గరెట్ ఆల్వా చేసిన ఆరోపణలు కాంగ్రెసు పార్టీలో సంచలనం కలిగించాయని ఆయన అన్నారు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లోనూ 2004 ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులు టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఇంతకు ముందు విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకునే సంప్రదాయం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుస్తుందని, చిరంజీవితో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.