కాకినాడ రేవులోకి కొట్టుకొచ్చిన నావ
కాకినాడ: 'ఖైముక్' తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉదయం నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం మధ్యలో చిక్కుకున్న ఓ భారీ నౌక కాకినాడ తీరానికి కొట్టుకొచ్చింది. దీన్ని సముద్రంలో నిలపడానికి నౌక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కోతకు వచ్చిన వరి, పత్తి పంటలు భారీ వర్షాల వల్ల నీట మునిగే ప్రమాదం కన్పించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications