విశాఖపట్టణం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజారాజ్యంపార్టీ సిద్దంగా ఉందని ఆ పార్టీ నాయకుడు నాగబాబు శనివారం విశాఖలో విలేకరులతో పేర్కొన్నారు.ఈ రోజు విశాఖలో జరగనున్న అఖిలపక్షం మహాధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్ధుల వ్యక్తిగతం, అనుభవం ఆధారంగానే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పొత్తులపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎస్‌ఈజెడ్, వాన్‌పిక్‌లపై పీఆర్పీ పోరాటం చేస్తుందని నాగబాబు తెలిపారు.