అనంతపురం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాయలసీమ ప్రజా అంకిత యాత్ర మంగళవారం మూడవరోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన తాను బస చేసిన కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులతో కొంతసేపు గడిపారు. విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనను అలరించారు. వేదిక మీదకు వచ్చి మరీ ఆయన వారిని అభినందించారు. పిల్లలు చిరును ముద్దులతో ముంచెత్తారు. పిల్లలపై చదువుల పేరుతో మానసిక ఒత్తిడి పెంచవద్దని ఆయన ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు. అనంతరం అనంతపురంనుంచి బయలుదేరిన ఆయన గార్లదిన్నెలో మొదట ప్రసంగించారు. అనంతరం పామిడి, గుత్తి మీదుగా ఆయన పర్యటన సాగుతోంది. తాడిపత్రి వరకు ఆయన పర్యటన సాగుతుంది.