రాజకీయ అవినీతిపై యుద్ధం: చిరు

Chiranjeevi
అనంతపురం: రాజకీయ అవినీతిపై యుద్ధబేరీ మోగిద్దామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి యువతకు పిలుపునిచ్చారు. ఆయన ప్రజా అంకిత యాత్ర మంగళవారం అనంతపురం జిల్లాలో సాగుతోంది. మనమంతా కలిసి అవినీతిని కూకటివేళ్లతో పెకిలిద్దామని ఆయన గుత్తి సభలో అన్నారు. అవినీతి వ్యవస్థీకృతమై పోయిందని, దాన్ని పెకిలించి వేస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కాబోవని ఆయన అన్నారు. యువతలో పౌరుషం తగ్గవద్దని ఆయన అన్నారు. దోపిడీ సాగుతూనే ఉన్నదని, గుత్తాధిపత్యం వహించేవారు ప్రజలను మోసం చేస్తున్నారని, వారి నుంచి ప్రజలు బయట పడాలని ఆయన అన్నారు.

చిరంజీవికి మద్దతిస్తున్నారని చెప్పి ప్రభుత్వ పెద్దలు యువత ఓట్లను తొలగిస్తున్నారని, ఈ విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని, ఓటర్ల జాబితాలో పేర్లున్నాయో లేదో యువత చూసుకోవాలని ఆయన అన్నారు. సామాజిక న్యాయం ప్రజారాజ్యం పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కొంత మంది గుత్తాధిపత్యం కోసం ప్రజలను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ నాయకులు వారి కోసమే పనిచేసుకుంటున్నారని, తాను ప్రజల కోసమ పనిచేస్తానని ఆయన చెప్పారు. మార్పును మనమే సాధించుకుందామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+