సెట్విన్ బస్సులకు బ్రేక్: దినేష్ రెడ్డి
హైదరాబాద్: సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టే ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై రవాణా మంత్రి త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టాలనే ఆర్టీసి నిర్ణయాన్ని వ్యతిరేకిరిస్తూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో ఆర్టీసి యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో మంగళవారం చర్చలు జరిపింది.
సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసి నష్టపోతుందని ఆర్టీసి కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. సంఘాల వాదనను ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు కూడా సమర్థించారు. ఆర్టీసి సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రవాణా శాఖ కన్నా లక్ష్మినారాయణ విదేశీ పర్యటనలో ఉన్నారు. మిగతా డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఆర్టీసి కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.












Click it and Unblock the Notifications