చిరుపై జోగయ్య కోపం?

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీలను వేరు చేసేందుకు మన వద్ద ప్రణాళిక ఉందా? మీరంటున్న సామాజిక న్యాయం జనానికి ఎక్కిందా? ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ముందు మన నినాదం నిలుస్తుందా? అని ఆ లేఖలో జోగయ్య చిరంజీవిని సూటిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పార్టీ సంస్ధాగత వ్యవహారాల మీద జోగయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ సరైన మార్గంలో పయనించడం లేదని ఆయన ఎత్తి చూపారు. కాంగ్రెస్ ఎంపీ అయిన హరిరామజోగయ్య ఆ పార్టీని విడిచి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరు పార్టీలో చేరిన అతి పెద్ద నాయకుడు ఆయనే. ఆయన ప్రజారాజ్యం పార్టీ వ్యహారాలతో సంతృప్తిగా లేరన్న వార్త సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications