'సత్యంబాబుకు రక్షణ మాతో కాదు'
విజయవాడ: విద్యార్థిని ఆయేషా హత్య కేసులో నిందితుడు పి.సత్యంబాబుకు తాము రక్షణ కల్పించలేమని కృష్ణా జిల్లా నందిగామ సబ్‌జైలు అధికారులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సిబ్బంది కొరత ఇందుకు కారణమని వారు వివరించారు. నిందితుడిని జిల్లా జైలుకు తరలించాలని వారు ఈ పిటీషన్‌లో కోరారు. సత్యంపై మరో రెండు కేసుల్లో నందిగామ పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు.
గతంలో జరిగిన నందిగామ ఎస్సీ బాలికల వసతిగృహం కాపలాదారు వరలక్ష్మి హత్య, కృషి కళాశాల విద్యార్థిని వంగపాటి రాధపై హత్యాయత్నం కేసుల్లో ఇతన్ని నిందితుడిగా పేర్కొంటూ స్థానిక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. వరలక్ష్మి హత్య కేసులో ఆమె భర్త మెరుగు రాజుపై కేసును తొలగిస్తున్నట్లు, రాధ హత్య కేసులో సహ విద్యార్థిని, అధ్యాపకులపై ఉన్న కేసులను పోలీసులు ఉప సంహరించుకున్నారు. దీంతో బాధితులు తమను అన్యాయంగా కేసుల్లో ఇరికించిన పోలీసులపై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications