చంద్రబాబుకు జూ.ఎన్టీఅర్ హామీ

చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ గన్నవరం, గుడివాడ శాసనసభా నియోజకవర్గాల సీట్ల కేటాయింపుపై మాట్లాడినట్లు తెలుస్తోంది. గన్నవరం సీటును ఎన్టీఆర్ తన సన్నిహిత మిత్రుడు వల్లభనేని వంశీకి ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే గుడివాడ సీటును తిరిగి ప్రస్తుత శాసనభ్యుడు కొడాలి నానికే ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన హామీ ఏమిటనేది తెలియదు. కానీ, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఎన్టీఆర్ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications