మోనికాను పెళ్లాడను: రాహుల్ మహాజన్

తన విడాకులు ఇంకా తేలాల్సి ఉందని, మోనికా కూడా చాలా విషయాల నుంచి బయటపడాల్సి ఉందని ఆయన అన్నారు. ఎల్లవేళలా ఆమెకు సహాయం అందిస్తానని ఆయన అన్నారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి పూనం కోసం ఆయన ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను రాజకీయల్లోకి రావడం తథ్యమని, అయితే దానికి ముందు ప్రొడక్షన్ హౌస్ పై దృష్టి పెడతానని ఆయన చెప్పారు. సినిమాల్లో నటించాలని తనకు అవకాశాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. రాహుల్ మహాజన్ తాను మోనికాను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు బిగ్ బాస్ సందర్భంగా వార్తలు వచ్చాయి. దీనిపై మోనికా బేడీ మాజీ ప్రియుడు అబూ సలేం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. తాను సలేంను పెళ్లి చేసుకోలేదని, మళ్లీ సలేంతో కలిసి ఉండేది లేదని మోనికా బేడీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications