కూటమిపై కారత్ తో బాబు భేటీ

chandrababu Naidu
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సిపిఎం ప్రదాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారివురి మధ్య చర్చలు జరిగాయి. వామపక్షాలతో తన బంధాన్ని గట్టి పరుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. ఎన్నికలకు ముందైనా, తర్వాతనైనా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తామని, అదే నిజమైన మూడో కూటమి అవుతుందని చంద్రబాబు కారత్ తో భేటీ అనంతరం చెప్పారు.

హిందూస్థాన్ టైమ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి తాను వచ్చానని ఆయన చెప్పారు. కారత్ ను కలిశానని, సాయంత్రం సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ ను కలుస్తానని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్రంగా తగ్గాయని, అయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని ఆయన అన్నారు. దీనిపై పార్లమెంటులో పోరాడుతామని ఆయన చెప్పారు. వామపక్షాలతో కలిసే పనిచేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+