భరోసాతో మీసం మెలేస్తా: చిరు

Chiranjeevi
కడప: ప్రజలు ఇచ్చిన భరోసాతో తాను మీసం మెలేస్తున్నానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. గుండె ధైర్యంతో తాను రాయలసీమ గడ్డు నుంచి వెళ్తున్నానని ఆయన అన్నారు. ఆయన ప్రజా అంకిత యాత్ర శుక్రవారం కడప జిల్లాలోని ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో సాగింది. ఆయన రాయలసీమ యాత్ర శుక్రవారం ముగుస్తోంది. సినిమా నటుడిగానే తనను ప్రజలు చూడడానికి రావడం లేదని, తమ ప్రజారాజ్యం పార్టీకి వారు ఓటేస్తారని ఆయన అన్నారు. మద్దతు నోటి మాటతో సరిపోదని, చేయితో మీట నొక్కి తమ శక్తిని ప్రదర్శించాలని ఆయన ప్రజలను కోరారు. ఓటు శక్తిని ఉపయోగించి, ప్రజారాజ్యం పార్టీని గెలిపిస్తే తన గమ్యం తాను చేరుకుంటానని, ప్రజలకు సుఖసంతోషాలను అందిస్తానని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీని నడపడానికి ప్రజలు తనను సారథిగా ఎంచుకున్నారని, మహిళలు తన వెనక ఉన్నారని ఆయన అన్నారు. రాజకీయాలను శుద్ధి చేయడానికి ఒక వ్యక్తి కావాలని ప్రజలు తనను కోరుకున్నారని ఆయన అన్నారు. తనపై ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారని ఆయన అన్నారు. స్వార్థం, సుఖం కోరుకోకుండా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి కాశీ వదిలి సీమ గడ్డ మీద అడుగుపెట్టిన దృశ్యాన్ని చిత్రీకరించిన విషయం గుర్తుకొస్తోందని, దాన్ని తాను నిజజీవితంలో చూస్తున్నానని ఆయన అన్నారు. తనను ఎప్పటికప్పుడు తన బరువు, బాధ్యత హెచ్చరిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. తనను కుటుంబంలో పెద్దన్నయలా ప్రజలు ఆదరిస్తున్నారని, ఆత్మబంధువులా చూస్తున్నారని, ప్రజారాజ్యాన్ని గద్దెనెక్కించే బాధ్యత ప్రజలదని, ఆ తర్వాత వారికేమీ చేయాలో తాను చేస్తానని, ఆ లక్ష్యాన్ని సాధిస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+