తెలంగాణతో కలుస్తాం: సీమ ఎంపి
న్యూఢిల్లీ: తాము తెలంగాణతో కలిసి ఉంటామని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వెంకటరామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమను తెలంగాణతోనే కలపాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద అన్నారు. వెనకబడిన తెలంగాణతో కలిసి వెనకబడిన తమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాను తమ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వినిపించనున్నట్లు ఆయన తెలిపారు.
రాయలసీమను ఆంధ్రతో కలుపవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రాంతంతో కలిపితే తమ రాయలసీమ ప్రాంతం మరింత వెనకబడి పోతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయదలిస్తే తాము కర్ణాటకతో కలుస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఇంతకు ముందు అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications