కదం తొక్కిన లెఫ్ట్: నేతల అరెస్టు
హైదరాబాద్: ఇళ్ల స్థలాలు, తదితర ప్రజాసమస్యలపై వామపక్షాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జిల్లా కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాదు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు వామపక్షాలు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, తదితర వామపక్షాల నాయకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా వామపక్షాల కార్యకర్తలు హైదరాబాదులోని ఆబిడ్స్ లో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రపోమని రాఘవులు అన్నారు.
కర్నూలులోనూ వామపక్షాల మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. వామపక్షాల నేతలు రామకృష్ణ, గఫూర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో కూడా వామపక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తాము మహాధర్నాను ఆపేది లేదని వామపక్షాల నాయకులు చెప్పారు. విజయవాడలో సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని వామపక్షాల కార్యకర్తలు ముట్టడించారు.












Click it and Unblock the Notifications