రాజీనామా చేస్తా: కైకలూరు ఎమ్మెల్యే
విజయవాడ: కైకలూరు శాసనసభ్యుడు రాజారామచందర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, గృహనిర్మాణాల శాఖల అధికారుల పనితీరు పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన శుక్రవారం ఆ విషయం చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో తన మద్దతుదారుల సమావేశంలో భవిష్యత్తు కార్యక్రమంపై ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు.
హౌసింగ్, రెవెన్యూ అధికారులు తనను లెక్కచేయడం లేదని రామచందర్ విమర్శిస్తున్నారు. ఇదే విషయంతో గతంలో ఆయన కృష్ణా జిల్లా కలెక్టరేట్ ముందు నిరవధిక దీక్ష చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఆయన తన దీక్షను విరమించుకున్నారు. తాను రాజీనామా చేస్తానని ఆయన గతంలో కూడా చాలా సార్లు చెప్పారు.












Click it and Unblock the Notifications