వైయస్ సిఎం కావడం కష్టమే: నారాయణ
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తిరిగి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం కష్టమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే తాను తూపాకి కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అనడంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. శత్రుచర్ల విజయరామరాజు తన ఆలోచనపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. శత్రుచర్ల విజయరామరాజు మంచి వ్యక్తి అని, శత్రుచర్ల వంటి నాయకుడిని పోగొట్టుకోవడం తమకిష్టం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
కోస్టర్ కారిడార్ కు సంబంధించిన జీవోలను అన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోస్టల్ కారిడార్ ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా విరమించుకోలేదని ఆయన అన్నారు. కోస్టల్ కారిడార్ రద్దు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications