చిరు సభకు వస్తూ ఒకరి మృతి
కడప: కడప జిల్లా రాజంపేటలో చిరంజీవి రోడ్‌షోలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు శుక్రవారం ప్రమాదానికి గురయ్యారు. సుండుపల్లినుంచి కడపకు జీపులో వస్తుండగా రామాపురం మండలం చిట్లూరు వద్ద లారీ ఢీకొంది. దీంతో బ్రహ్మయ్య అనే కార్యకర్త అక్కడే మృతి చెందగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారంనాడు విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతకు ముందు అనంతపురం జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో కూడా ఒక యువకుడు మృత్యువాత పడ్డాడు.












Click it and Unblock the Notifications