వరంగల్ జైల్లో మూడో ఖైదీ మృతి
వరంగల్: వరంగల్ కేంద్ర కారాగారంలో ఖైదీల మృత్యుపరంపర గత కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఈ జైలులో ముగ్గురు ఖైదీలు మరణించారు. శుక్రవారం నాగేశ్వరరావు అనే ఖైదీ మరణించాడు. దీంతో తీవ్ర సంచలనం ఏర్పడింది. ఇంతకు ముందు ముత్తయ్య, కాంతారావు అనే ఇద్దరు ఖైదీలు మరణించారు. వీరు ముగ్గురు కూడా ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడం విశేషం.
జైలులో పరిస్థితులు బాగా లేకపోవడం వల్లనే ఖైదీలు అనారోగ్యానికి గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇంత జరిగినా జైలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications