• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరుకు అసెంబ్లీలో 15 సీట్లే: వైయస్

By Staff
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి వచ్చే ఎన్నికల్లో 15కు మించి శాసనసభా సీట్లు రాబోవని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జోస్యం చెప్పారు. తమిళనాడులో విజయకాంత్ సభలకు ప్రజలు చిరంజీవికి మన రాష్ట్రంలో వచ్చినట్లే వచ్చారని, కానీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచారని, అది కూడా విజయకాంత్ ఒక్కరే గెలిచారని ఆయన అన్నారు.

ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడారు. చిరు ఒక్కరే గెలుస్తారా అని మీడియా ప్రతినిధి అడిగితే తాను సంఖ్య గురించి మాట్లాడడం లేదని, ఒక్కటి, ఐదు, పది రావచ్చునని, తనకున్న సమాచారం ప్రకారం చిరంజీవికి 15 సీట్లకు మించి రాబోవని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూడా 15 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X