తప్పులు దిద్దుకున్నందుకే పొత్తు: సిపిఎం
హైదరాబాద్: కాంగ్రెస్ అమెరికా అనుకూల వైఖరి, బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగానే ఆ పార్టీలను ఓడించేందుకు సిద్ధమయ్యామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తెలిపారు. ఇందులో భాగంగానే టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యామని అన్నారు. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకున్నారు కనుకే తెలుగుదేశం పార్టీ ధ్యక్షుడు చంద్రబాబును మూడో ఫ్రంట్‌లోకి ఆహ్వానించామని అన్నారు. ఈ నెలాఖరుకు జరిగే పౌలిట్‌బ్యూరో అనంతరం టీడీపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను ప్రస్తావిస్తున్న ప్రజారాజ్యం పార్టీ నేతలు అప్పట్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తప్పులు సరిదిద్దుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని ఆయన ప్రజారాజ్యం పార్టీ నేతలను ప్రశ్నించారు. పొత్తు కోసం తెలుగుదేశం పార్టీకి భూపంపిణీ వంటి అంశాలపై షరతులు పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తే పోరాటాలు తప్పవని ఆయన అన్నారు. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరిగే రాష్టర కమిటీ సమావేశాల్లో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని, ఈ సమావేశాలకు తమ పార్టీ అగ్రనేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి వస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications