కాంట్రాక్ట్ సిఎంను పెట్టుకుందాం: కెసిఆర్

తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు న్యాయం జరుగుతుందని, తెలంగాణలో ఉన్న 12శాతం గిరిజనులకు రిజర్వేషన్లు పెరుగుతాయని, గిరిజనాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకోవచ్చన్నారు. తెలంగాణ గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి తుడుందెబ్బ రుచి చూపించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చిన్నవాడైన చిరంజీవి మొదలు తెదేపా, భాజపా, వామపక్షాలు కూడా తెలంగాణకు అనుకూలమని ప్రకటించాయన్నారు. ఈనేపథ్యంలో డిసెంబరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే అమృతం తాగుతుందని, లేకపోతే విషం తాగాల్సి వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉంటే బెల్లంపల్లి, ఇల్లెందు పట్టణాలు తరలిపోతాయని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఈసమస్యలుండవన్నారు.












Click it and Unblock the Notifications