మందుపాతరకు 5గురు పోలీసుల బలి
న్యూఢిల్లీ: చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ఐదుగురు భద్రతాధికారులు మరణించారు. ఎన్నికల అధికారులతో వెళ్తుండగా మావోయిస్టులు వంతెనను పేల్సివేశారు. ఎన్నికల అధికారులకు ఏ విధమైన ప్రమాదం జరగలేదని, ఒక పోలీసాఫీసర్ మరణించాడని పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ అమర్నాథ్ ఉపాధ్యాయ చెప్పారు.
శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమీషన్ అధికారులు ఇక్కడికి వచ్చారు.పోలీసులు కాలినడక దాటుతుండగా మావోయిస్టులు వంతెనను పేల్చివేశారు. అనంతరం మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.












Click it and Unblock the Notifications