తెలుగులో వన్ ఇండియా ఆర్కుట్ ఆప్

బెంగళూరు: భారతీయ భాషా పోర్టల్స్ నిర్వహణలో ప్రధానంగా నిమగ్నమై ఉన్న వన్ ఇండియా డాట్ ఇన్ మరో అడుగు ముందుకు వేసింది. ఆర్కుట్ కోసం ఎంటర్ టైన్ మెంట్ ఆప్ లను ప్రాంతీయ భాషల్లో వన్ ఇండియా అందించనుంది. సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ కోసం ప్రాంతీయ భాషా యాప్స్ ను తయారు చేయడం భారతదేశంలో ఇదే ప్రధమం. వన్ ఇండియా ప్రాంతీయ పోర్టల్స్ అయిన దట్స్ హిందీ, దట్స్ తెలుగు, దట్స్ కన్నడ, దట్స్ మలయాళం, దట్స్ తమిళ్ లలో ఆర్కుట్ కోసం ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆప్స్ లో సినిమా వార్తలు, సినిమా సమీక్షలు, ప్రముఖుల గాసిప్స్, ఆడియో ప్రారంభోత్సవాలు ఇంకా ఎన్నో ఉంటాయి.

"సినిమాలు మన జీవితంలో ఎంతో ప్రధానమైనవి. ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచం నుంచి తాజా వార్తా విశేషాలను వన్ ఇండియా ఆప్ మీ ముందుంచుతుంది." అని గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రై. లిమిటెడ్ సిఇవో బిజి మహేష్ ఈ సందర్భంగా అన్నారు. సోషల్ ప్లాట్ ఫాం ఆవశ్యకతను వివరిస్తూ ఆయన " భారత దేశంలో 17 శాతానికి పైగా యూజర్లు ఉన్న ఆర్కుట్ ఉత్తమ ప్లాట్ ఫాం. సోషల్ ప్లాట్ ఫామ్స్ లో కంటెంట్ ను పాఠకులు పంచుకోవడం చాలా సులభం. యూజర్లు తమ ఆర్కుట్ అకౌంట్ లోకి సులభంగా వెళ్ళి వన్ ఇండియా ఆప్ (Oneindia app.)ను ఎంచుకోవాలి. ఆప్స్ కోసం ఇక్కడ కూడా క్లిక్ చేయవచ్చు https://www.oneindia.com/sns/ .

వన్ ఇండియా గురించి
వన్ ఇండియా డాట్ ఇన్ ( గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీస్ పోర్టల్) భారతదేశంలో అగ్రగామి పోర్టల్. భారతీయులకే కాకుండా ప్రవాస భారతీయులకు వార్తా విశేషాలు, ఇతర ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. వన్ ఇండియా డాట్ ఇన్ గత ఎనిమిదేళ్ళుగా సేవలు అందిస్తుండగా, ప్రాంతీయ భాషా పోర్టల్స్ 2000 ఏప్రిల్ నుంచి పనిచేస్తున్నాయి.

వన్ ఇండియా పోర్టల్స్: Oneindia.in, Click.in

Contact:
Greynium Information Technologies Pvt. Ltd
5th Floor, Shanthishree Industrial Complex
17/1, Rupena Agrahara, Hosur Road,
Bangalore - 560 068
INDIA

E mail: [email protected]
Phone: +91.80.40580800
Fax: +91.80. 40580801

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+