వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎఫ్ ఆఫీసర్ భార్యపై అత్యాచారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానాలోని పంచకుల జిల్లా వెస్టర్న్ కమాండ్ ఆస్పత్రిలో భారత వైమానిక దళానికి (ఐఎఎఫ్) అదికారి భార్యపై ఆత్యాచారం చేశారని ఆరోపణపై పోలీసులు మంగళవారం ఇద్దరు సైనికాధికారులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరు నిందితులు హొత్తం సింగ్, ఇఫ్తెకార్ ఖాన్ ఆర్మీ ఆస్పత్రిలో నర్సింగ్ అటెండంట్స్ గా పనిచేస్తున్నారు. వారిని అరెస్టు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ సందీప్ ఖిర్వార్ ఒక వార్తా సంస్థతో చెప్పారు.

35 ఏళ్ల స్త్రీ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు, వారిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు ఆర్మీ మెడికల్ కార్ప్స్ కు చెందినవారని, వారిని చండీమందిర్ లోని ఆస్పత్రిలో విధులపై నియోగించినట్లు రక్షణ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఇద్దరు నిందితలు కస్టడీకి పంచకుల పోలీసులు ఆర్మీకి లాంఛనంగా విజ్ఞప్తి చేసుకున్నారు. పంచకుల జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

బీహార్ కు చెందిన బాధితురాలు ప్రస్తుతం పంచకులలోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ క్వార్టర్స్ లో ఉంటోంది. ఫిజియోథెరపి కోసం ఆమె శనివారం చండీమందిర్ ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో ఉన్న తన బంధువులను పలకరించడానికి పోతోంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను సమీపంలోని గదిలోకి లాక్కెళ్లి రేప్ చేశారు. నిందితుల్లో హొత్తం సింగ్ మధ్యప్రదేశ్ కు చెందినవాడు కాగా ఇఫ్తెకార్ బీహార్ కు చెందినవాడు. బాధితురాలు తన కుమారుడితో ఇక్కడ ఉంటోంది. భర్త ఇటీవలే గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషనుకు బదిలీ అయ్యాడు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X