వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ ఫిర్యాదుపై ఏం చేశారు: ఉండవల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఇచ్చిన ఫిర్యాదు అంశాలపై తీసుకున్న చర్యలేమిటని తాను ప్రధాన ఆదాయం పన్నుల కమిషనర్ అడిగినట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారంనాడు ప్రధాన ఆదాయం పన్నుల కమీషనరును కలుసుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాదులోని బషీర్ బాగ్ కాల్పుల్లో మరణించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. బషీర్ బాగ్ కాల్పులకు కారణమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సిపిఐ కలవడాన్ని నిరసిస్తూ ఆయన ఈ శ్రద్ధాంజలి ఘటించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో మరణించిన అమరవీరుల వల్లనే తాము గత ఎన్నికల్లో గెలిచామని ఆయన అన్నారు. సంస్కరణలకు ఆద్యుడని చెబుతున్న చంద్రబాబుతో సిపిఐ పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని ఆయన అన్నారు. కాంగ్రెసుపై వామపక్షాలకు కోపం ఉండవచ్చునని, అయితే మనం ఎవరినైతే హంతకుడు, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని అంటున్నామో ఆ చంద్రబాబునాయుడితో వామపక్షాలు కలవడం విచారకరమని ఆయన అన్నారు. బషీర్ బాగ్ కాల్పులకు కారణమైన చంద్రబాబుతో చేతులు కలపడంపై వామపక్షాలు వివరణ ఇవ్వాలని ఆనయ డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X