వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంద్యంతో లాభపడ్డ ఇండో అమెరికన్ బ్యాంక్

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆర్థిక మాంద్యంతో అమెరికాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో న్యూజెర్సీలో ఇండియన్ అమెరికన్లు నడుపుతున్న బ్యాంకు మాత్రం లాభపడుతోంది. ఆర్థిక మాంద్యమే ఈ బ్యాంకుకు లాభం తెచ్చి పెట్టేదిగా మారింది. ఎడిసన్ కు చెందిన ఇందుస్ అమెరికన్ బ్యాంకులో ఖాతాలు తెరవడానికి ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో బ్యాంకు సేవింగ్స్ ఒక్కసారిగా 30 శాతానికి పైగా పెరిగినట్లు ప్రమోటర్లు తెలిపారు.

పెద్ద బ్యాంకుల్లో జమ చేయడానికి నష్టాలు వస్తాయని పెద్ద ఖాతాదారులు భయపడుతున్నారని, చాలామంది ఇండియన్ అమెరికన్ వ్యాపారులు తమ డబ్బులను పెద్ద బ్యాంకుల నుంచి తమ బ్యాంకుకు మార్చుకుంటున్నారని ఇందుస్ అమెరికన్ కో-ప్రమోటర్ అనిల్ బన్సాల్ అంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల తమ బ్యాంకు లాభపడిందని ఆయన చెప్పారు. ఈ బ్యాంకు 18 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎడిసన్ లోని ఓక్ ట్రీ రోడ్డులో మూడేళ్ల క్రితం ప్రారంభమైంది.ప్రస్తుతం 125 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్స్ ఉన్నాయి. తాము సబ్ ప్రైమ్ మోర్టిగేజ్ కు వెళ్లక పోవడం వల్లనే హాయిగా ఉన్నామని బన్సాల్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X