• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిఎంతో వైయస్ భేటీ: ప్రాజెక్టులపై వినతి

By Staff
|

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని రాజశేఖర రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను గురించి ఆయనకు వివరించారు. కేంద్రం అందిస్తున్న ఆర్థికసాయాన్ని పెంచాలని కోరారు. కేంద్రం నుంచి తమకు మరింత సాయం కావాలని ఆయన ప్రధానిని కోరారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కలిసే అవకాశం ఉంది. ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. ఆయన ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణపై జరిగే కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X