బిజెపి ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు దొరబాబు తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం శాసనసభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
దొరబాబు కాంగ్రెసులో చేరడానికి ముందు బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంలో కూడా ఆయన క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారు. అయితే ఆయన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరుతారని భావించారు. పిఠాపురం టికెట్టును ప్రజారాజ్యం పార్టీ వంగా గీతకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయన కాంగ్రెసులో చేరారు. దొరబాబు రాజీనామాతో బిజెపి శాసనసభలో కిషన్ రెడ్డి ఒక్కరే మిగిలారు.












Click it and Unblock the Notifications