అసోం రైల్లో పేలుడు: ముగ్గురు మృతి
గౌహతి: అసోంలోని ఒక ప్యాసెంజర్ రైల్లో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం 7 గంటల 50 నిమిషాల ప్రాంతంలో జరిగింది. లామ్డింగ్ - తీన్ సూకియా ప్యాసెంజర్ రైల్లో ఈ పేలుడు సంభవించింది.
డిపూ రైల్వే స్టేషన్ వద్ద ఈ పేలుడు జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పేలుడుకు కారణాలు తెలియడం లేదు. పేలుళ్ల వెనక ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైల్లో బాంబు పెట్టారని డిఐజి చెప్పారు.












Click it and Unblock the Notifications