నేనేం తప్పు చేయలేదు: అచ్యుతానందన్

సందీప్ తండ్రి కాకపోతే కుక్కలు కూడా ఆ ఇంటికి వెళ్లవని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. సందీప్ తండ్రి ప్రవర్తనపై తనకేమీ కోపం లేదని, తాను, హోంమంత్రి సందీప్ ఇంటికి వెళ్లినప్పుడు సందీప్ తండ్రి మానసిక స్థితి బాగా లేదని ఆయన భార్య, బంధువులు చెప్పారని, అపార్థం చేసుకోవద్దని చెప్పారని ఆయన వివరించారు. అచ్యుతానందన్ చేసినట్లు చెబుతున్న ఆరోపణలపై కేరళ శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగిది. సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ కేరళ రాష్ట్రంలోని కజికోడ్ కు చెందినవారు. ఉన్నికృష్ణన్ కుటుంబాన్ని ఉద్దేశించి అచ్యుతానందన్ చేసిన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు.












Click it and Unblock the Notifications