కసబ్ పాకిస్థానీ కాదు : జర్దారీ
ఇస్లామాబాద్: ఇవరై మంది అనుమానితులను తమకు అప్పజెప్పాలన్న భారత్ డిమాండ్‌ను పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తోసిపుచ్చారు.ముంబయి పేలుళ్ల వెనుక తమ హస్తం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వారిని తామే తమ కోర్టుల్లో విచారించి కఠినంగా శిక్షిస్తామన్నారు. భారత్ చెబుతున్నట్లు పేలుళ్లలో పట్టుబడిన కసబ్ పాకిస్థానీ అనేందుకు భారత్ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. అతను అసలు పాకిస్థానీయేనా అనే విషయంపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఓ అమెరికన్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications