హైదరాబాద్: సమావేశాలకు ముందు జరిగిన మీటింగ్‌లో వీరే సభ నాలుగైదు రోజులేనా పది పదిహేను రోజులైనా ఉండాలి అని కోరారని మొదలయ్యాక చూస్తే రెండో ప్రశ్న దాటి సభ ముందుకు వెళ్లటం లేదని మంత్రి రోశయ్య అన్నారు.ప్రతిపక్షాల తీరు తమకు ఏం అర్థం కాకుండా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న, ఈరోజు జరుగుతున్న సభ తీరుచూస్తే కావాలని గొడవ పెంచి వాకౌట్లు చేస్తున్న సంగతి స్పష్టంగా తెలుస్తోందన్నారు. బయట కలిసి పనిచేస్తే సరే... సభలో కూడా తెరాస, వామపక్షాలు టీడీపీకి సై అంటూ పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని అని మండి పడ్డారు. సభ పెట్టమని కోరేది వారే...పెడితే చొక్కాలు చింపుకుని అరిచి యాగీచేసి వాకౌట్లు చేసి సభ జరగకుండా చేసేది వారే ఇదేం పద్ధతని దీనిపై స్పీకర్ ఏదైనా చేయాలని రోశయ్య కోరారు.