వర్షాలు మాకు వరం: వై.ఎస్

రైతుల పక్షాన ఉన్న పార్టీ ఏదో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో విపక్షాలు విద్యుత్ సరఫరాపై నిరసన వ్యక్తం చేసి వాకౌట్లు చేసిన అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఏ ఏడాదికూడా సరిగా వర్షాలు పడలేదని అన్నారు. తాము వచ్చాక ఏటా వర్షాలు బాగా పడుతున్నాయని, ఇలా నాలుగేళ్లపాటు వరుసగా వర్షాలు పడటం ఓ రికార్డు అని ఆయన అన్నారు.
తాము 7 గంటల కరెంటును ఇస్తున్నామని ఇవ్వలేదని అసత్యాలు చెప్పటం సరికాదని అన్నారు. ఈరోజు ఎన్నికలు దగ్గరకు వచ్చాయని ఇష్టం వచ్చినట్లు వాగ్థానాలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. ఆయన పేరు చంద్రబాబు కాదని ఫ్రీబాబుగా మారిపోయిందని అన్నారు.












Click it and Unblock the Notifications