మోడీ, తొగాడియా వీడియోలే..: కసబ్

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియాల ప్రసంగాలే తమను ఈ ఉగ్రవాద దాడులకు ప్రేరేపించాయని ముంబై దాడుల్లో పట్టుబడిన తీవ్రవాది అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ చెప్పాడు. పోలీసుల విచారణలో కసబ్‌ పలు విషయాలను వెల్లడించాడు. శిక్షణ సమయంలో తమకు మోడీ, తొగాడియాల ప్రసంగాల వీడియోలను చూపించారనీ, పాక్‌కు, జీహాద్‌కు వ్యతిరేకంగా వారు చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలే తమలో పోరాట స్ఫూర్తిని రగిలించాయని చెప్పాడు. గుజరాత్‌ అల్లర్ల వీడియోలు, భారత్‌లో ముస్లింలు పడుతున్న బాధలను కూడా తమ శిక్షణ శిబిరాల్లో చూపించారని కసబ్‌ వెల్లడించాడు. ఈ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులంతా 21-28 ఏళ్ల మధ్య వయస్సున్నవారేననీ, తామందరికీ వేర్వేరు చోట్ల శిక్షణ ఇచ్చారనీ, అందరం గతంలో ఎప్పుడూ కలుసుకోలేదని, సెప్టెంబరులో మాత్రం పది మందిమి ఒకచోట కలిశామని కసబ్‌ చెప్పాడు. ఐఎస్‌ఐ, పాక్‌ సైన్యం సహకారంతోనే లష్కరే తోయిబా శిక్షణ శిబిరాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నట్లు కసబ్‌ వెల్లడించాడు.

ఎటువంటి దర్యాప్తునైనా ప్రతిఘటించడానికి తమను విపరీతంగా కొట్టి సిద్ధం చేశారని అతను చెప్పాడు. తనతో పాటు ముంబై దాడుల్లో పాల్గొన్న తొమ్మిది మంది పేర్లను కూడా అతను వెల్లడించాడు. వారిని సోహెబ్ (20), చోటా అబ్దుల్ రహ్మాన్ (21), ఉమర్ (22), అబూ అలీ (23), ఫహదుల్లా (24), ఇస్మాయిల్ ఖాన్ (25), బడా అబ్దుల్ రహ్మాన్ (25), అబూ ఆకాష (26), ఉమైర్ (28)లుగా అతను గుర్తించాడు. లష్కరే తోయిబాకు చెందిన జకీర్ రహ్మాన్ అలియాస్ చాచు తమ ప్రధాన శిక్షకుడని అతను చెప్పాడు. ముఫ్తీ సయీద్, ఫహదుల్లా, ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్, అబూ అనూస్ తదితరులు తమకు శిక్షణ ఇచ్చినట్లు అతను చెప్పాడు. తమకు శిక్షణ ఇచ్చారని కసబ్ చెబుతున్నవారు చాలా మంది పాకిస్తాన్ సైన్యం నుంచి పదవీ విరమణ చేసినవారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఐఎస్ఐతో సమన్వయం చేస్తూ వీరు లష్కరే తీవ్రవాదులకు శిక్షణ ఇస్తుండవచ్చునని వారు చెప్పారు. నిరుడు డిసెంబర్ నెలాఖరులో శిక్షణ ప్రారంభమైందని, బెనజీర్ భుట్టో హత్యానంతరం శిక్షణలో ఉధృతి పెరిగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+