నక్సల్స్ సమస్యపై గెలిచాం: సిఎం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: నక్సలైట్ సమస్యను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం దాదాపుగా విజయం సాధించిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజమని ఆయన అన్నారు. శాంతిభద్రతలపై జరిగిన చర్చకు ఆయన గురువారం శాసనసభలో సమాధానమిచ్చారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, తాము 37 వేల మంది పోలీసులను నియమించుకున్నామని, ఇంత పెద్ద యెత్తున పోలీసు నియామకాలు చేసిన ఘనత ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఆక్టోపస్ ను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. నక్సలైట్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి తాము అప్పట్లో మద్దతు ఇచ్చామని, రాజకీయం చేయలేదని, ఉగ్రవాదుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. తాము ఈ దేశంలో అంతర్భాగమని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పదే పదే చెప్పారని, ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రతిపక్షాల ఫోన్ లు ట్యాప్ చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని, తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదని ఆయన అన్నారు. ఉన్నవీ లేనివి మాట్లాడి పోలీసు వ్యవస్థ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయవద్దని ఆయన సూచించారు. ప్రతిపక్షాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండంటూ ఆయన చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకంలోని మాటలను ఉంటంకించారు. బిజెపి అంతకు ముందు చంద్రబాబుకు మతతత్వ పార్టీగా కనిపించలేదని, 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మతతత్వపార్టీగా కనిపించిందని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని చంద్రబాబు వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. చంద్రబాబు ఉనికి ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+