న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు ఓ విచిత్రమైన టర్న్ తీసుకున్నాయి. ఎవరూ ఊహించని వ్యక్తిని సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. రేసులో లేని అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శుక్రవారం సోనియా ప్రకటించారు. దాంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబయిపై ఉగ్రవాదుల దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఉపముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ రెండు రోజుల క్రితం తమ పదవులకు రాజీనామ చేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా చగన్‌భుజ్‌బల్‌ను నియమించాలని ఉదయం తీర్మానించారు. సాయంత్రం జరిగిన సమావేశంలో అశోక్ చవాన్‌ను ముఖ్యమంత్రిగా ఎంపికచేశారు. చవాన్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావు చవాన్ కుమారుడు. ప్రస్తుత సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.