రైతు సమస్యలపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్: రైతు సమస్యలపై శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింగి. రైతుల రుణమాఫీ, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రభుత్వ వైఫల్యమేనని బిజెపి, వామపక్షాలు విమర్శించాయి. ఈ విషయంపై మంత్రి రోశయ్య విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాల అనంతరం ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ, బిజెపి, సీపీఎం సభ నుంచి వాకౌట్ చేశాయి.
రుణమాఫీ పథకం రైతులందరికీ ఉపయోగపడేలా చూడాలి కాని ఎగ్గొట్టేవారికి లాభం కలిగించేలా ఉండరాదని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అన్నారు. రుణాలు తీసుకుని కట్టనివారికి లక్షరూపాయలు మాఫీ చేసి తల తాకట్టు పెట్టయినా నిజాయితీగా కట్టినవారికి 5వేలు ఇవ్వటం ఏం న్యాయమని అన్నారు. ఈ మాఫీని అందరికీ సమానంగా వర్తింపజేయాలని కోరారు. రైతులందరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వలేకపోతే తాము అధికారంలోకి రాగానే తప్పక అందరికీ ఇస్తామని ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన పలు వాయిదాతీర్మానాలను స్పీకర్ సురేష్ రెడ్డి తిరస్కరించి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఆ వెంటనే రైతుల రుణమాఫీపై చర్చ జరిగింది.
ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయటం, చెల్లించినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వటం అభినందనీయమని వామపక్షాల సభ్యులు అన్నారు. అయితే వీటిలో పలుఅవకతవకలు చోటుచేసుకున్నాయని వీటిని నివారించాలని కోరారు. తెలంగాణ రాష్టర్ సమితి (తెరాస) సభ్యుడు హరీష్‌రావు మాట్లాడుతూ తన కసలు వ్యవసాయమే లేదని తనకూ ప్రోత్సాహకం వచ్చిందని దీన్ని బట్టి ఈ లిస్టుల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో ఆలోచించాలని ఆయన అన్నారు. హరీష్ రావు తీసుకున్న రుణం కూడా మాఫీ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పడంపై హరీష్ రావు స్పందించారు. రుణమాఫీ పథకం బాగా అమలవుతోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications