దోపిడీ దొంగల బీభత్సం: కాల్పులు
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని పెట్రోల్ పంపులో దోపిడీ దొంగలు శుక్రవారం తెల్లవారు జామున బీభత్సం సృష్టించారు. పెట్రోల్ పంపుపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ పంపు నుంచి 90 వేల రూపాయలు దొచుకెళ్లినట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ వద్ద గల పెట్రోల్ పంపులో ఈ సంఘటన జరిగింది. గతంలో కూడా ఇదే పెట్రోల్ పంపులో దోపిడీ జరిగింది. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ పోలీసు కమీషనర్ సందర్శించారు. దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications