ముంబయి : మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగా అవటం పార్టీలో కొందరిని తట్టుకోలేని పరిస్ధితికి తీసుకొస్తోంది. పరిశ్రమల శాఖ మంత్రిగా న్యాయం చేయలేకపోయిన అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎలా రాణిస్తారని నారాయణ్‌రాణే ఆరోపించారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనపై రాజకీయకుట్ర చేశారని దుమ్మెత్తిపోశారు. ఇక నుంచి సోనియాగాంధీని నమ్మబోమని చెప్పారు. ముంబయి మారణహోమానికి దేశ్‌ముఖ్‌దే బాధ్యత అని తెలిపారు. అశోక్ చవాన్ కింద తాను పనిచేయనని ప్రకటించారు. దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు నల్లటి మచ్చ అని... భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.