యుధ్ధం రాదు: జర్దారీ
ఇస్లామాబాద్ : ముంబయి బాంబు ప్రేలుళ్ళ అనంతరం పాక్ పై భారత్ నిరసన తెలియచేస్తూన్న సందర్భంలో అంతా యుద్ధం వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్య దేశాలైన పాకిస్థాన్, భారత్‌లు యుద్ధానికి దిగబోవని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తెలిపారు. శాంతి యుతంగా సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. 'ప్రజల ఓటుతో మేమంతా ఎన్నికయ్యాం. ఇరువురి మధ్య యుద్ధం జరగదు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు' అని వివరించారు. అమెరికాపై దాడి జరిగినందుకే ఇరాక్‌పై యుద్ధానికి దిగిందని వెల్లడించారు. గతంలో జరిగిన భారత్-పాక్ యుద్ధాలన్నీ సైనిక నియంతల కాలంలో జరిగాయని తెలిపారు.












Click it and Unblock the Notifications