హ్యాపీ న్యూస్:పెట్రోలు రేటు తగ్గింది

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో డిసెంబర్ 11న మంత్రివర్గం సమావేశమై పెట్రో ధరల తగ్గింపుపై ప్రకటన చేయాలని నిర్ణయించడం తెలిసిదే. అయితే అంతకంటే ముందుగానే పెట్రో ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయడం విశేషం. కాకపోతే అంతా ఊహించినట్లు లీటరు పెట్రోలుపై రూ. 10, డీజిలుపై రూ. 5 తగ్గించకపోవడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 67 డాలర్లకు చేరితే పెట్రో ధరలు తగ్గిస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే చమురు కంపెనీలు లాస్‌లో ఉన్నాయని ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం, ఆర్థిక మాంద్యం దృష్ట్యా పెట్రో ధరలను ఊహించినంత కాకపోయినా, కొంతమేర తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications