ఇస్లామాబాద్: జైషె అహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్‌ను పాక్ ప్రభుత్వం గృహనిర్భందంలో ఉంచింది. అతన్ని భారత్‌కు అంగీకరించేది లేదన్న పాక్ ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది . 1999లో ఖాట్మండు నుంచి కాందహార్ వెళుతున్న విమానాన్ని ఇతని ఆధ్వర్యంలోనే ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ సమయంలో ఇతన్ని అరెస్టుచేసి జైలులో ఉంచిన భారత ప్రభుత్వం అనంతరం ప్రయాణీకుల ఎక్స్ఛేంజిలో భాగంగా అతన్ని విడుదల చేసింది. ఆ తర్వాత అతనిపై భారత్ పలుసార్లు ఆరోపణలు చేసింది. అయితే చేసిన ప్రతిసారి అతన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రకటిస్తోంది. తాజా నిర్భందం కూడా అలాంటిదేనని అంతా భావిస్తున్నారు.