తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచే..
కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పన్నేండేళ్లకొకసారి జరిగే ఈ పుష్కరాలు బుధవారం తెల్లవారు జామున మూడు గంటలకు ప్రారంభమై పదకొండు రోజులపాటు కొనసాగుతాయి.బృహస్పతి పుష్కరునితో కలిసి మకరంలో ప్రవేశించినప్పుడు తుంగభద్రకు పుష్కరాలు జరుగుతాయి. ఇక ఈ పుష్కరస్నానాలు ఆచరించిన భక్తులు వెంటనే దైవదర్శనం చేసుకునేందుకు అన్ని దేవాలయాలను అందంగా తీర్చిదిద్దారు. పదకొండున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుష్కరాలకు రానున్నడనంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా శ్రీవారి మందిరాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications