హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అవుతారు. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం పట్ల అభినందనలు తెలిపే అవకాశాలున్నాయిని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే సోనియాకు జన్మదిన వేడుకలను జరుపుకునే అలవాటు లేనందున ఆమెను సీఎం ఈరోజు కలుస్తారో లేదో చెప్పడం కష్టమని పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే బుధవారం మాత్రం కచ్చితంగా కలిసే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అలాగే కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిదంబరాన్నీ వైఎస్ కలిసి అభినందిస్తారు.