యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి కేసులో నిందితులైన శ్రీకాంత్, సంజయ్, హరికృష్ణలుఎన్‌కౌంటలో హతమయ్యారు.ఈ సంఘటన మమ్నూర్ గుట్టల వద్ద శనివారం తెల్లవారు ఝామున చోటుచేసుకుంది. దాడికి ఉపయోగించిన వాహనాలు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై నిందితులు యాసిడ్, కత్తులు, తుపాకులతో దాడికి యత్నించారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి బైక్, యాసిడ్ బాటిల్, మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది పోలీసులు కల్పించిన ఫేక్ ఎన్‌కౌంటర్ అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications