హైదరాబాద్: శుక్రవారంనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమనాయుడును బాలయ్య ఘనంగా స్వాగతించారు. వాస్తవానికి ముద్దు కృష్ణమనాయుడు తిరిగి తెలుగు దేశం పార్టీలోకి రావటంతో యువరత్న బాలకృష్ణ దే ప్రముఖ పాత్ర అని పార్టీ వర్గాలు మెచ్చుకుంటున్నారు. దాంతో ఆయన పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారని స్పష్టమవుతోందని అంతా అంటున్నారు. అలాగే బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో గతంలో వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిన నాయకులను తిరిగి సొంతగూటికి రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు పార్టీ సీనియర్ నేతలు సాయిం చేస్తున్నారు.