హైదరాబాద్: ఈ నెలాఖరులో బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి గురువారం రాత్రి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. ఆ చర్చల్లో తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు, దుళ్ల, జేగురుపాడు, కపిలేశ్వరపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు పెట్టుకున్నామని.. వాటికి రావాలని బాలయ్యను ఆహ్వానించారు. ఈ నెలాఖరులో వాటికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని బాలయ్య చెప్పినట్లు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడాక రాయలసీమలో పర్యటన, ఇతర కార్యక్రమాలను ఖరారుచేద్దామని ఆయన అన్నట్లు తెలిసింది.